పందిపిల్ల సినిమాకు అతిథులను పిలిస్తే అసహ్యంగా ఉంటుందని పాదయాత్ర: రవిబాబు

  • పందిపిల్లతో పాదయాత్ర చేసిన ‘అదుగో’ చిత్రబృందం
  • కేబీఆర్ పార్క్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకూ పాదయాత్ర
  • తమ కష్టాన్ని చూసైనా చిత్రాన్ని ఆదరించాలన్న రవిబాబు
రవిబాబు కాన్సెప్ట్‌లు ఎప్పుడూ కాస్త విచిత్రంగానే ఉంటాయి. పందిపిల్లతో సినిమా తీయాలనుకోవడమే ఒక ఆసక్తికరమైన విషయమంటే.. దానితో ఆయన ఎంచుకున్న ప్రచారం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. హైదరాబాద్, కేబీఆర్ పార్క్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకూ రవిబాబు ఈ రోజు తన పందిపిల్లతో పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ‘అదుగో’ చిత్ర యూనిట్ పాల్గొంది. దారిన వెళ్లేవారంతా పాదయాత్రను ఆసక్తిగా తిలకించారు. ఈ చిత్రంలో పందిపిల్ల పేరు బంటి.

అయితే అవసరమొచ్చినప్పుడే ఇలాంటి ఐడియాలు వస్తాయని రవిబాబు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేద్దామనుకున్నామని, కానీ పందిపిల్ల సినిమాకు అతిథులను పిలిస్తే అసహ్యంగా ఉంటుందని విరమించుకున్నామన్నారు. ప్రమోషన్ చేసేందుకు సరిపడా బడ్జెట్ కూడా లేకపోవడంతో ఈ పాదయాత్ర ఐడియా వచ్చిందని తెలిపారు.

తన సినిమాకు సూపర్ స్టార్ బంటియేనని తెలిపారు. 100 రోజులపాటు బంటి షూటింగ్‌లో పాల్గొన్నట్టు రవిబాబు వివరించారు. తాము మూడేళ్ల పాటు పడిన కష్టాన్ని చూసైనా చిత్రాన్ని ఆదరించాలని రవిబాబు కోరారు. దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Go Back to Shorts
Ravibabu
Bunty
Adugo
KBR Park
Film Chamber

More Telugu News